స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసిన సీఎం

24 Jul, 2016 23:41 IST|Sakshi
స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసిన సీఎం
 
జిల్లాపరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి 
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వీర్యం చేశారని జెడ్పీచైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక దర్గామిట్ట జెడ్పీ కార్యాలయంలో పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు చైర్మన్‌గా రెండేళ్ల పాలన పూర్తికావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, పన్నులు రాకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివద్ధి జరగలేదన్నారు. తమకున్న నిధుల్లోనే ప్రజల అవసరాలను తీర్చేందుకు శక్తి మేరకు కషి చేస్తున్నామన్నారు. కొన్నేళ్లుగా ఆయా పాఠశాలల్లో మరమ్మతులకు గురైన వేలాది కంప్యూటర్లను రిపేర్‌ చేయించామన్నారు. పాఠశాలకు ఇన్‌స్ట్రక్టర్లను నియమించి కంప్యూటర్‌ విద్యాబోధనను పునరుద్ధరింపజేస్తామని తెలిపారు. ఈ ఏడాది 8, 9 తరగతులకు మార్గదర్శి ప్రత్యేక మెటీరియల్‌ను అందజేస్తామన్నారు.
ఇంటర్‌ విద్యపై ఉద్యమం
 కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ను రద్దు చేయాలని చైర్మన్‌ డిమాండ్‌ చేశారు. పాఠశాల స్థాయిలోనే 11, 12 తరగతుల విద్యావిధానాన్ని అమలు చేయాలన్నారు. సీడ్‌ (సెకండరీ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ డిజైన్‌) ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. చైర్మన్‌ పదవితో నిమిత్తం లేకుండా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ప్రక్షాళనకు ఉద్యమించడం ఏకైక లక్ష్యమన్నారు. జెడ్పీటీసీలకు ప్రాధాన్యతనివ్వడంలేదని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పుట్టినరోజు సందర్భంగా చైర్మన్‌ కేక్‌ కట్‌చే శారు. జెడ్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. చైర్మన్‌గా మొదటి తనకు సంతప్తినిచ్చిందన్నారు. రెండో సంవత్సరం ఆశించిన స్థాయిలో అభివద్ధి పనులు జరగలేదని దీనికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.రామిరెడ్డి, ఇన్‌చార్జ్‌ ఏఓ వసుమతి, సిబ్బంది పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు