నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్

1 May, 2016 09:01 IST|Sakshi

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది, సోమవారాల్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకుని రాత్రి ఉత్తర తెలంగాణ భవన్‌లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు కాళేశ్వరం చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం కన్నెపల్లి వద్ద పంప్‌హౌజ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత హెలికాప్టర్‌లో అంబట్‌పల్లికి చేరుకుంటారు. గోదావరి తీరంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్న సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

మరిన్ని వార్తలు