పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం

23 Aug, 2016 01:17 IST|Sakshi
పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం

లింగాల ఘాట్‌లో నదీమతల్లికి పూజలు
 
 సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/సాక్షి ప్రతినిధి, కర్నూలు : కృష్ణా పుష్కరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్రంలోని పలు పుష్కర ఘాట్లను పరిశీలించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైదలో పర్యటించిన ఆయన.. తొలుత అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుని, దైదలో పుష్కర ఘాట్లను సందర్శించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  దైతను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. క్రీడాకారిణి సింధుకు మనం చేసిన ప్రార్థనలతో వెండి మెడల్ వచ్చిందన్నారు. ఇక్కడ పుట్టిన బిడ్డ భారత దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. నేడు ఆమె పుష్కర స్నానానికి వస్తోందని తెలిపారు.

 కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల పుష్కర ఘాట్‌ను చంద్రబాబు పరిశీలించారు. నది ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు.

 నదీమతల్లికి చీర సమర్పించిన సీఎం
 కృష్ణా పుష్కరాల్లో భాగంగా శ్రీశైలంలోని లింగాలఘాట్‌ను సీఎం సందర్శించారు. నదిలో పసుపు, కుంకుమ, చీరను వదిలి కృష్ణా నదీమ తల్లికి పూజలు చేశారు.

మరిన్ని వార్తలు