'సీఎం వాచ్ వేలం వేసి వారిని ఆదుకోండి'

15 Feb, 2016 09:12 IST|Sakshi
'సీఎం వాచ్ వేలం వేసి వారిని ఆదుకోండి'
సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేత జనార్థన పూజారి సలహా
 
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వద్ద ఉన్న రూ.50 లక్షల విలువైన చేతి గడియారాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుతో సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని వీరమరణం పొందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికుల కుటుంబాలకు అందజేయాలని కాంగ్రెస్ నేత జనార్థన్ పూజారి సూచించారు. మంగళూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
' ఆయనకు ఎవరు అంత ఖరీదైన వాచ్ ను బహుమతిగా ఇచ్చారో నాకు తెలియడం లేదు. ఆయన ఇంతటి ఖరీదైన వాచ్ ను ధరించడం పార్టీకి కూడా అంత లాభదాయకం కాదు. అందుకే ఆ వాచ్ ను వేలం వేయడమే మంచిది. చేతి గడియారాన్ని ధరించడం అంత ముఖ్యమైన విషయమేమి కాదు, అయితే రాష్ట్రంలో అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే ముఖ్యం. ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతున్న ఈ వాచ్ ను వేలం వేసి, తద్వారా వచ్చిన మొత్తాన్ని వీర సైనికుల కుటుంబాలకు అందజేస్తే బాగుంటుంది' అని జనార్థన పూజారి సూచించారు.
>
మరిన్ని వార్తలు