టెంకాయల వేలం వాయిదా

2 Aug, 2016 00:29 IST|Sakshi
వేలంపాట నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు
గద్వాల న్యూటౌన: పుష్కరాల్లో నదీఅగ్రహరం పుష్కరఘాట్‌ వద్ద టెంకాలు విక్రయించేందుకు సోమవారం నిర్వహించిన వేలం పాట వాయిదా పడింది. దాదాపు రూ.5లక్షల వరకు వేలం ఖరారు చేయగా కేవలం కేవలం 1.2లక్షల వరకు మాత్రమే వేలందారులు పాడడంతో అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి 6న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీఅగ్రహారం వద్ద శ్రీరామావధూత మఠం పరిధిలో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకావం ఉందని అధికారులు భావిస్తూ ఈనెల 8 నుంచి 25వ తేదీ వరకు టెంకాయలు విక్రయించుకునేందుకు రూ. 50 వేల డిపాజిట్‌తో వేలానికి పిలిచారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శకుంతల, ఈఓ పురందర్‌ కుమార్‌లు వేలం పాట నిర్వహించగా కేవలం 1.2లక్షల వరకు మాత్రమే పాడారు. తక్కువ ఆదాయం రావడంతో అసిస్టెంట్‌ కమిషనర్‌ సూచన మేరకు వాయిదా వేశారు. ఇదిలావుండగా లడ్డు, పులిహోరను విక్రయించుకునేందుకు రూ.40వేల డిపాజిట్‌తో వేలం పాట నిర్వహించగా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రభాకర్‌ 3.35లక్షలకు పాడి దక్కించుకున్నారు. అలాగే కొబ్బరి చిప్పల సేకరణకు రూ.40వేకు నర్సింహ అనే వ్యక్తి రూ.41,500కు దక్కించుకున్నాడు.
 
 
 
మరిన్ని వార్తలు