కలెక్టరేట్‌ ‘న్యాక్‌’లో వద్దు

29 Aug, 2016 23:49 IST|Sakshi
జగిత్యాల అర్బన్‌ : జగిత్యాల జిల్లా కలెక్టరెట్‌ కార్యాలయాన్ని న్యాక్‌ భవనంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, మరోసారి పరిశీలించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్‌ శశాంకకు వినతిపత్రం అందజేశారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాక్‌ భవనం జగిత్యాలకు 10కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు రహదారి సౌకర్యం సరిగ్గా లేదన్నారు. అంతేకాకుండా న్యాక్‌ విద్యార్థులకు సైతం ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ధరూర్‌ క్యాంపులో సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉందని, అక్కడ ఉన్న క్వాటర్స్‌లోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని వివరించారు. ఎస్సారెస్పీ సర్కిల్‌ ఆఫీసులోనే 200 మంది వరకు విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరోసారి ఆలోచించి కలెక్టర్‌ కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వాటర్లలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.  
 
 
 
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’