సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి

2 May, 2017 00:22 IST|Sakshi
  • సావధానంగా సమస్యలు విన్న కలెక్టర్‌ మిశ్రా
  • సంబంధిత అధికారులకు ఆదేశాలు
  • కాకినాడ సిటీ : 

    కలెక్టరేట్‌లో ప్రతివారం నిర్వహించే మీ కోసం ప్రజావాణి ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా నూతన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సోమవారం కోర్టుహాలులో కలెక్టర్‌ వినతుల స్వీకరణ చేపట్టారు. వచ్చిన ప్రతి అర్జీదారుడినీ ఆప్యాయంగా పలుకరించి వారు చెప్పే సమస్యలను సావధానంగా విన్న తరువాత, ఆ సమస్య పరిష్కారంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన వేగి సత్యనారాయణమ్మ అనే వృద్ధురాలు తన భూమిని సర్వే నంబర్‌ 124/3సి2లో 3.28 సెంట్లు పోలవరం కాలువ కోసం ప్రభుత్వం తీసుకున్నదని, ఈ భూమికి రెండు దఫాలుగా నష్టపరిహారం చెల్లించారని, మూడో దఫా పరిహారం చెల్లింపులో భూమి తనదని చెప్పి ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఆవేదన చెందింది. ఆయాస పడుతున్న ఆమెకు తన కోసం పెట్టిన తాగునీటిని అందించి, ఆమె సమస్యను పెద్దాపురం ఆర్డీఓకు సమాచారం ఇచ్చి గురువారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సామర్లకోటకు చెందిన యార్లగడ్డ విజయకుమార్‌ తనకు చెందిన అసై¯ŒS్డ భూమి వేలం వేసి స్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరగా దీనిపై కాకినాడ ఆర్‌డీఓ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో సుమారు 185 మంది అర్జీదారులు హాజరై కలెక్టర్‌కు సమస్యలపై వినతులు అందజేశారు. ఈ ఫిర్యాదులలో పింఛన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా రావడం, వికలాంగులు, వయోవృద్ధులు పింఛన్లు పొందకపోవడంపై కలెక్టర్‌ స్పందిస్తూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మలి్లబాబును తగు చర్యల నిమిత్తం ఆదేశించారు. అలాగే కాకినాడ శివారు ప్రాంతాల్లో గృహ నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులు ప్రత్యేక ప్రాజెక్టుగా అమలు చేయాలని మున్సిపల్‌ కార్పొరేష¯ŒS కమిషనర్‌ అలీంబాషాకు సూచించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ కలెక్టరేట్‌లో కంప్యూటరీకరించాలని, ఈ దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై వచ్చే మూడు రోజుల్లో సంబంధిత అధికారులు నివేదికలు సమర్పించాలన్నారు.
     
     
    నిర్ధిష్టమైన చర్యలు ఉండాలి 
    ప్రజా సమస్యలపై నామమాత్రం చర్యలను అనుమతించేది లేదని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు. మండల, డివిజ¯ŒSస్థాయిలో అక్కడ సమస్యలు పరిష్కరించే దిశలో అధికారులు చర్యలు చేపట్టాలని, అర్జీదారులు జిల్లా కేంద్రానికి రావాలి్సన అవసరం ఉండదన్నారు. సంబంధిత అధికారులకు మార్క్‌చేసిన అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని, తీసుకున్న చర్యల నివేదిక కలెక్టర్‌కు పంపించాలని ఆదేశించారు. డీఎఫ్‌ఓ నందిని, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, ఇ¯ŒSచార్జి డీఆర్‌ఓ ఎం.జ్యోతి, డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మలి్లబాబు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు