పొర్లుకట్టలు పటిష్టం చేస్తాం

20 Jul, 2016 17:01 IST|Sakshi
 
కోట : పుచ్చలపల్లి, కర్లపూడి గ్రామాల్లో స్వర్ణముఖి పొర్లుకట్టలను జిల్లా కలెక్టర్‌ జానకి మంగళవారం పరిశీలించారు. గతేడాడి వరదల సమయంలో పొర్లు కట్టలు కోతకు గురైన ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్లపూడి రైతులు తమ సమస్యలను ఆమె దష్టికి తెచ్చారు. రైతుల సహకరిస్తేనే పనులు త్వరగా పూర్తి చేయగలుగుతామని కలెక్టర్‌ తెలిపారు. కొత్తపాళెం నుంచి సిద్దవరం వరకు 2.5కిలో మీటర్లు మేర స్వర్ణముఖి చల్లకాలువ పొర్లు కట్టలకు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందన్నారు. బ్రీచ్‌లకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్న ఆక్వారైతుల విన్నపాన్ని ఆమె అంగీకరించలేదు. పనులు ప్రారంభిస్తే మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పొర్లు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను మ్యాప్‌ద్వారా పరిశీలించారు.ఆమె వెంట సబ్‌కలెక్టర్‌ గిరీషా, జలవనరుల శాఖ ఈఈ నారాయణ్‌నాయక్, డీఈ ఆనంద్, ఏఈ ఫరూక్, తహసీల్దార్‌ లీలారాణి, కర్లపూడి సర్పంచ్‌ చెంచురాఘవరెడ్డి, ఆనంద్‌రెడ్డి ఉన్నారు.
 
మరిన్ని వార్తలు