వేడుకలు ఘనంగా నిర్వహించాలి

9 Aug, 2016 22:58 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  •  
    ఖమ్మం జెడ్పీసెంటర్‌ : నగరంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయా శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా సిబ్బందికి వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓకు సూచించారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసే ఛాయాచిత్రాల ప్రదర్శన కోసం శాఖల వివరాలు సేకరించాలని, శకటాల వివరాలు కూడా తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీకి చెప్పారు. మంత్రి తుమ్మల ప్రసంగానికి అన్ని శాఖల అధికారులు నోట్స్‌ను బుధవారంలోగా పంపించాలని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏడుకు మించి ఉండకుండా చూడాలని డీఈఓను ఆదేశించారు. ప్రతి శాఖ నుంచి ఒక ఉత్తమ ఉద్యోగి ప్రశంసపత్రం అందుకునేందుకు ఎంపిక చేయాలన్నారు. ఓడీఎఫ్‌ గ్రామాల ఎంపిక జాబితాను అందజేయాలని జెడ్పీ సీఈఓను కలెక్టర్‌ ఆదేశించారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు