ఉపాధ్యాయుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవు

7 Sep, 2017 13:01 IST|Sakshi

కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు
గూడూరు రూరల్‌  : విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో బోధనా విధానంలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ రేవు ము త్యాలరాజు ఉపాధ్యాయులను హెచ్చరిం చారు. బుధవారం గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని ప్రిన్సిపల్స్, హెచ్‌ఎంలు, విద్యాశాఖాధికారులకు ఓరియంటేషన్‌ ప్రోగామ్‌ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ పాల్గొని, మాట్లాడారు.  కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సుకు నిధులు మంజూరయ్యాయని, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించి బోధన మెరుగు పరుస్తామన్నారు. ఈ ఏడాదిని విద్యానామ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు.

పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వారాంతపు పరీక్షల ఫలితాలపై స్పష్టత లేదన్నారు. 70 శాతం వరకు విద్యార్థులకు మార్కులు చెప్ప డం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు విద్యాశాఖ రూపొందించిన నివేదికను చదివి వినిపించారు.  విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చదువు చెప్పని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని, అందుకు హెచ్‌ఎంలే బాధ్యత వహించాలని హెచ్చరించారు.  ఈ ఏడాది విద్యార్థులను నాలుగు గ్రేడ్‌లుగా విభజించడం జరుగుతుందన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఈ ఏడాది అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, కాపీ చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు మార్కులు చెప్పాల్సిందేనని, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందిచా లన్నారు.

డిపార్ట్‌మెంట్‌ వారీగా డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ ప్రతి సోమవా రం సబ్జెక్టుల వారీగా హెచ్‌ఎంలు సమీక్ష నిర్వహించాలన్నారు. నవంబరు 30వ తేది లోగా ఫిజిక్స్, గణితం సిలబస్‌ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. అనంతరం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ పీఓ కాశీ విశ్వనాథ్, డీఐఓ సాయి, ట్రైనీ కలెక్టర్‌ మహేష్, గూడూరు తహసీల్దార్‌ జి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ ఎండీ ఇస్మాయిల్, ఎంఈ ఓలు, ప్రిన్సిపల్స్, హెచ్‌ఎంలు, సీఎఫ్‌సీ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు