రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

11 Nov, 2016 00:11 IST|Sakshi
రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం
 • డివిజన్ల నుంచి రికార్డుల పంపించామంటారు.. కలెక్టరేట్‌లో అందలేదంటారు
 • ఎప్పుడూ ఇదే సమాధానమా?
 • కలెక్టర్‌ ముత్యాలరాజు
 •  
  నెల్లూరు(పొగతోట):
  కోర్టు కేసులు, భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల నుంచి కలెక్టరేట్‌కు రికార్డులు పంపించామంటారు, కలెక్టరేట్‌ ఉద్యోగులు రాలేదంటారు ఎప్పుడూ ఇదే సమాధానమా అంటు కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. లోకాయుక్తకు సంబంధించిన సమాచారం చివరి నిమిషంలో చెబుతున్నారన్నారు. లోకాయుక్తకు సంబంధించిన కేసుల విషయం ముందుగా తెలియజేయాలని ఆదేశించారు. ఎల్‌ఈసీ (లోన్‌ ఎల్జిబులిటీ కార్డ్స్‌) ఉన్నవారికి రూ.50 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేయించామని తెలిపారు. సీజేఎఫ్‌ఎస్‌ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ ఎల్‌ఈసీ కార్డులు మంజూరు చేయాలన్నారు. జాతీయ రహదారికి భూసేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. ధరలు నిర్ణయించే విషయంలో కావలి ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.60 లక్షలుగా నిర్ణయించారన్నారు. దీంతో బాధిత రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. 
  పెద్ద నోట్ల రద్దుపై ఇబ్బందులు పడకుండా చూడాలి
   రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు.  రెవెన్యూకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలకు సంబంధించి రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చినా తీసుకోవాలని సూచించారు. జేఈ ఇంతియాజ్‌ మాట్లాడుతు ఎల్‌ఈసీ కార్డుల మంజూరులో నాలుగు మండలాలు మాత్రమే 60 శాతం లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించి రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ టి. ధర్మారెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులురెడ్డి, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.
   
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా