జిల్లా అభివృద్ధే లక్ష్యం

24 Apr, 2017 23:10 IST|Sakshi
జిల్లా అభివృద్ధే లక్ష్యం

– సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకుంటా
– సాగు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి
– పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం
– కలెక్టర్‌ జి.వీరపాండియన్‌


అనంతపురం అర్బన్‌ : ‘జిల్లా అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ తాగు, సాగునీటి సమస్య అధికంగా ఉందని బాధ్యతలు చేపట్టిన వెంటనే తెలుసుకున్నా. వీటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తా. సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తా’నని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వచ్చి తన ఫైలుపై సంతకం చేశారు.

ఈ సందర్భంగా తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లా  దేశంలోనే అత్యంత వెనుకబడిందనే విషయం తెలుసన్నారు. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వంద శాతం అందితేనే ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన చాలా ముఖ్యమని, ప్రస్తుతం జిల్లాలో ఆ దిశగా జరుగుతున్న పనులను వేగవంతం చేస్తామని వివరించారు. అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు