విష జ్వరాలపై అవగాహన తీసుకురావాలి

18 Sep, 2016 00:08 IST|Sakshi

హిందూపురం రూరల్‌ : ‘ప్రస్తుత సీజన్‌లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అధికార యంత్రాంగం మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్మూలించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి’ అని కలెక్టర్‌ కోన శశిధర్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన తహశీల్దార్‌ కార్యాలయాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలñ క్టర్‌ మాట్లాడుతూ డెంగీ, మలేరియా లక్షణాల నివారణ గురించి 10 లక్షల కరపత్రాలు ముద్రించామన్నారు. వాటిని ప్రతి ఇంటికీ పంపిణీ æచేసి ప్రజల్లో విషజ్వరాలపై అవగాహన తీసుకురావాలని కోరారు. మున్సిపాల్టీల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు సొంత ఖర్చులతో తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారి బాధ్యతగా తీసుకుని డెంగీ కేసులు, విషజ్వరాలు నమోదు కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు పనితీరును పరిశీలిస్తామని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్‌ఎంపీ క్లినిక్‌లు సీజ్‌ చేయండి
మున్సిపాల్టీల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతమంది జ్వర బాధితులు ఉన్నారనే విషయాన్ని ఆ ఏరియా వైద్యాధికారి సమాచారం సేకరించాలన్నారు. అదేవిధంగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సీజ్‌ చేయమని తహశీల్దార్‌లకు ఆదేశించారు. విద్యాధికారులు, ఉపాధ్యాయులు ప్రతి శనివారం విద్యార్థులతో సీజనల్‌ వ్యాధులపై ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పసుపులేటి విశ్వనాథ్, తహశీల్దార్‌ చల్లా విశ్వనాథ్, ఎంపీడీఓ శ్రీలక్ష్మి, హిందూపురం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కేశవులు, ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది, వీఆర్వోలు, కార్యదర్శులు, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు