నవ్వుల రేడు రేలంగి

12 Dec, 2016 15:13 IST|Sakshi
 • హావభావాలతో నిండైన హాస్యం
 • హాస్యంలో తొలి పద్మశ్రీ అందుకున్న మహానటుడు
 • నేడు ఆయన 41వ వర్ధంతి
 • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
  హాస్యంతో గిలిగింతలు పెట్టించాడు. నడక, హావ భావాలతో కడుపుబ్బా నవ్విం చాడు. ఆబాలగోబాలాన్ని అలరిం చిన నవ్వులరేడు ‘రేలంగి’ గురించి తెలియని వారు ఉండరు. హాస్యం లో తొలి పద్మశ్రీ అందుకున్న మహా నటుడు రేలంగి వెంకట్రామయ్య వర్థంతి. జిల్లాలోని రావులపాలెంలో 1909 ఆగస్టు 8న 1909లో రేలంగి వెంకటస్వామి, అచ్చాయమ్మ దంపతులకు జన్మించా రు. తండ్రి వద్దే సంగీతం, హరికథలు నేర్చుకున్నారు. 15వ ఏట ‘బృహన్నల’ నాటకంలో స్త్రీ పాత్ర ద్వారా నటనకు శ్రీకారం చుట్టారు. 1937లో విడుదలైన భక్తప్రహ్లాద సినిమా చూసి తాను ఇక సినిమాల్లోనే నటించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో రేలంగి అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా 1935లో కోల్‌కత్తా వెళుతున్న శ్రీకృష్ణతులాభారం చిత్ర యూని ట్‌లో కలిసిపోయాడు. ఆ యూనిట్‌లో నెలకు రూ.30 జీతానికి పనిచేసేవారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 12 ఏళ్లు దాటిపోయినా చిన్నచితకా వేషాలు తప్ప సరైన గుర్తింపు రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డారు. అదే సమయంలో హెచ్‌.ఎం.రెడ్డి నిర్మిస్తు న్న గుణసుందరి కథ చిత్రంలో మంచి పాత్ర లభించింది. అక్కడ నుంచి ఆయన దశ మారిపోయిం ది. తర్వాత మాయాబజార్, ప్రేమించిచూడు, సత్యహరిశ్చంద్ర, వెలుగునీడ లు, లవకుశ, జగదేకవీరుని కథ చిత్రాల్లో తనదైన హాస్యంతో వరుస విజయాలతో రేలంగి దూసుకుపోయారు. 1960లో ఆయ న సమాజం అనే చిత్రాన్ని నిర్మిం చారు. భాగస్వామిగా మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించారు. ఆయన 1975 నవంబర్‌ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. 
   
  వితరణ శీలి
  తొలినాళ్లలో తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. మద్రాసులో వేరుశనగ గింజలు తిని కడుపునింపుకొనేవారు. తర్వాత వరుస హిట్‌లతో చిత్ర పరిశ్రమలో కీలక వ్యక్తిగా మారిపోయారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన లోటు ఎవరూ భర్తీ చేయలేరు. 
  – అడబాల మరిడయ్య, సినీ విశ్లేషకుడు  
మరిన్ని వార్తలు