సమాజం గుర్తించేలా పని చేయాలి

2 Aug, 2016 22:55 IST|Sakshi
మొక్క నాటుతున్న పూల రవీందర్‌
  • ఎమ్మెల్సీ పూల రవీందర్‌
  • జన్నారం : సమాజం గుర్తించేలా ఉపాధ్యాయులు పని చేసి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలానికి వచ్చిన ఆయన పీఆర్టీయూ భవన్‌ పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమౌళి అధ్వర్యంలో సన్మానించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆంగ్లమాధ్యమం బోధిస్తున్నారని పేర్కోన్నారు. అదే విధంగా ఏకీకృత సర్వీసు రూల్‌పై ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని, ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అంకిత భవంతో పని చేసి, మంచి పేరు తీసుకురావాలని పేర్కోన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దారట్ల జీవన్, ప్రధాన కార్యదర్శి ఇన్నారెడ్డి, పత్రిక సంపాదకులు పార్వతి సత్యనారాయణ, మండలాధ్యక్షుడు కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జాజాల శ్రీనివాస్, జిల్లా నాయకులు అనుముల రాజన్న, నాసాని రాజన్న, లచ్చన్న, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు