అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలి

22 Jan, 2017 23:22 IST|Sakshi
అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలి

– ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌
అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్, స్పెయిన్‌ మారథాన్‌ రన్నర్‌ జువాన్‌ మానువెల్‌ కోరారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ రన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానువెల్‌ మాట్లాడుతూ పరుగుతో మానవుల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. గతేడాది జిల్లాలో ఆర్డీటీ ప్రోత్సాహంతో 140 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నట్టు తెలిపారు.

ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ చేసిన సేవా కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయన్నారు. గ్రామీణ స్థాయి అథ్లెట్లను ప్రోత్సహించేందుకు పరుగు పందెం దోహదపడుతుందన్నారు. ఈ నెల 24, 25న జిల్లాలో అల్ట్రా మారథాన్‌ పరుగు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఆదివారం జరిగిన కమ్యూనిటీ పరుగు పందెంలో 35 మంది స్పెయిన్‌ మారథాన్లు, జిల్లాకు చెందిన క్రీడాకారులు, బధిరులు, వయోజనులు, పిల్లలు పాల్గొన్నారన్నారు. 120 మంది క్రీడాకారులు 15 జట్లుగా ఏర్పడి 4.6 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్‌ తిప్పేస్వామి, హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్, డైరెక్టర్లు జేవియర్, దశరథ్, నిర్మల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు