కేడీసీసీబీ ఆధ్వర్యంలో పోటీలు

19 Oct, 2016 01:04 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): వచ్చే నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆధ​‍్వర్యంలో విద్యార్థులకు, సహకార సిబ్బందికి, కవులు, రచయితలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా సీఈఓ రామాంజనేయులు తెలిపారు. సహకార వ్యవస్థ ఔనత్యం చాటి చెప్పడం, సహకార సంఘాలు నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టేదెలా తదితర వాటిపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకు 83330 32950ను సంప్రదించాలన్నారు.
- డిగ్రీ విద్యార్థులకు నవంబరు 6న మద్దూరు నగర్‌లోని మాస్టర్‌ జూనియర్‌ కళాశాలలో దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ పాత్ర, ప్రాధాన్యత అవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు.
- కవులు, రచయితలకు సహకార వ్యవస్థ– ఔన్నత్యం అనే అంశంపై కవితలు రాసి వచ్చే నెల 7వ తేదీలోపు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు పంపాలి.
- పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి సహకార వారోత్సవాలు ప్రారంభం రోజున బహుమతులు పంపిణీ చేస్తారు.   
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా