టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై ఫిర్యాదు

17 May, 2016 19:56 IST|Sakshi
టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై ఫిర్యాదు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నర్సింహంపై (జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ) నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్కు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మైనర్లు అయిన తమ పిల్లల ఫోటోలను అభ్యంతరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంపీతో పాటు మరో అయిదుగురిపైనా అతడు ఫిర్యాదు చేశాడు.

మాధవపట్నంలోని ఓ భూవివాదంలో తమ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రవికుమార్ ఫిర్యాదుపై స్పందించిన నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇందుకు సంబంధించి ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ తోట నర్సింహం ఖండించారు. తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు