కానిస్టేబుళ్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి

1 May, 2017 22:59 IST|Sakshi
కానిస్టేబుళ్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి

శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస్‌
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో నూతన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల పాటు అందిం చే శిక్షణకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయ న శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. 277 మంది జిల్లా అభ్యర్థులను హైదరాబాద్, వరంగల్‌ జి ల్లాలకు ప్రత్యేక బస్సులలో తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శిక్షణ పొందేందుకు గాను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏఆర్‌ విభాగంలో ఎంపికైన 250 మంది అభ్యర్థులు ఇక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.

మే 1న ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌ చేతుల మీదుగా శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి కంప్యూటరీకరణతో అభ్యర్థులను తీర్చిదిద్ధేలా బోధన వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు.

అభ్యర్థులు ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణతో శిక్షణ పూర్తిచేసుకోవాలన్నారు. వృత్తినైపుణ్యాలు, క్రమశిక్షణ, దేహదారుఢ్యం, ప్రజలతో స్నేహసంబంధాలు, పోలీసు విధులు, చట్టంలోని అంశాలు తదితర విభా గాల్లో శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పనసారెడ్డి, శిక్షణ కేంద్రం డీఎస్పీ సీతా రాములు, ఆర్‌ఐ బి. జేమ్స్, సురేంద్ర, టూటౌన్‌ సీఐ వెంకటస్వామి, బోథ్‌ సీఐ జయరాం,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు