హరితహారం లక్ష్యం పూర్తిచేయండి

31 Aug, 2016 01:33 IST|Sakshi
వీసీలో కలెక్టర్‌ శ్రీదేవి, ఇతర అధికారులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : హరితహా రం కార్యక్రమంలో భాగంగా  జిల్లాకు ని ర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. మంగళవారం ఆయన హై దరాబాద్‌ నుంచి  తెలంగాణకు హరితహారం, జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ తదితర విషయాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా తెలంగాణకు హరితహారం కింద ఇప్పటి వరకు నాటిన మొక్కలు పూర్తిచేయాల్సిన లక్ష్యాలను సమీక్షిస్తూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలను నాటడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.    
 
 
వర్షపాతం లేకనే : కలెక్టర్‌ టికె.శ్రీదేవి 
ఇన్నాళ్లూ జిల్లాలో కనీసం సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదు కావడంతో పథకానికి కాస్త బ్రేక్‌ పడిందని తెలిపారు. వర్షాల్లేక 48 వేల హెక్టార్లలో పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో సగభాగం మొక్కలు నాటేందుకు వీల్లేక హరితహారంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని తెలిపారు. అలాగే కష్ణా పుష్కరాలు కూడా రావడంతో పథకం ముందుకు సాగలేదన్నారు. అయినప్పటికీ నాటిన కోటి 90 లక్షల మొక్కల్లో 90 శాతం మొక్కలను బతికించుకోగలిగామని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. రానున్న సంవత్సరంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వీసీలో వివరించారు. 
 
 
భూసేకరణ పనులు త్వరలో పూర్తి
జాతీయ రహదారికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను మూడు వారాల్లో పూర్తిచేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రైల్వేకు సంబంధించి 830 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 411 ఎకరాలు సేకరించామని, నెలన్నర కాలంలో దీన్ని కూడా పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరె¯Œæ్సలో జేసీ ఎం.రాంకిషన్, డీఎఫ్‌ఓలు గంగారెడ్డి, రామ్మూర్తి, పద్మాజా, డ్వామా, డీఆర్‌డీఏల పీడీలు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 ఎన్‌సీడీసీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్‌నగర్‌ వ్యవసాయం :  కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌సీడీసీ) ద్వారా అందజేస్తున్న రాయితీ రుణాలను జిల్లాలోని గొర్రెల కాపారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ టికే శ్రీదేవి కోరారు. పథకం కింద 2012–13 సంవత్సరంలో రూ.65కోట్ల రుణాలు మంజూరయ్యాయని, వాటిలో ఒక్కో యూనిట్‌లో 20శాతం రాయితీ  మరో 60శాతం రుణంగా పొందవచ్చని మిగితా 20శాతం సొమ్మును మార్జిన్‌మని కింద లబ్దిదారలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2014–15 ఏటా మొదటి విడుతగా రూ.18.54కోట్ల రూపాయలను 1707 మంది లబ్దిదారులకు మార్టిగేజ్‌ ద్వారా రుణాలు అందజేస్తే అందులో ఇప్పటి వరకు రూ.2.90కోట్ల రికవరి సొమ్మును ఎన్‌సీడీసీకి చెల్లించినట్లు ఆమె తెలిపారు. రెండో విడుతగా రూ.33.18కోట్ల రూపాయలు జిల్లా గొర్రెల పెంపకందారుల యూనియన్‌లో జమ అయ్యాయని వీటి ద్వారా 3305 యూనిట్లను గొర్రెల కాపారులకు అందజేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు ఆమె తెలిపారు. అర్హత ఉన్న గొర్రెల కాపారులు ప్రాథమిక గొర్రెల సహకార సంఘం ద్వారా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
 
 
మరిన్ని వార్తలు