ముగిసిన కాలభైరవ హోమం

5 Feb, 2017 23:42 IST|Sakshi
ముగిసిన కాలభైరవ హోమం
  • ఘనంగా మహా పూర్ణాహుతి
  • లక్ష గారెలతో 42 గంటలు సాగిన క్రతువు
  • అమలాపురం గోశాలకు పోటెత్తిన భక్త జనం
  • అమలాపురం టౌన్‌ : 

    అమలాపురం గౌతమ మహర్షి గోసంరక్షణ సమితి గోశాల నూతన ప్రాంగణంలో లక్ష గారెలతో మూడు రోజులుగా జరుగుతున్న అఖండ కాలభైరవ హోమం ఆదివారం ఉదయం మహా పూర్ణాహుతితో ముగిసింది. 42 గంటల పా టు కాలభైరవ జపంతో లక్ష గారెలను హోమ గుం డంలో వేస్తూ జ్వలింప చేసిన సంగతి తెలిసిందే. పూ ర్ణాహుతి క్రతువును తిలకించేందుకు భక్తులు వేలాది తరలివచ్చారు. నూతన గోశాల కుమ్మరి కాల్వ చెంతన వరిచేల మధ్య ఉండడంతో భక్తులు వరిచేల గట్టు, కాల్వగట్టు వెంబడి వరుసగా రావడంతో అక్కడో తిరునాళ్లు జరుగుతున్నంత స్థాయిలో భక్తజనం తరలివచ్చారు. దీంతో గోశాల భక్తులతో పోటెత్తింది. కొబ్బరికాయలు, కురిడీ కొబ్బరి కాయ లు, గుమ్మడి కాయలు, పోక కాయలు, ఇప్ప పువ్వు లు, నలుపు, తెలుపు చీరలు కూడా హోమం వేస్తూ పూర్ణాహుతి నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య దంపతులు, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, బీసీ కార్పొరేష¯ŒS డైరెక్టర్‌ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖులు పూర్ణాహుతిలో పాల్గొని హోమంలో ద్రవ్యాలు, సమిధులు వేసి పూజలు చేశారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, కనకదుర్గ దంపతల ఆధ్వర్యంలో జరిగిన ఈ అరుదైన లక్ష గారెల అఖండ కాలభైరవ హోమాన్ని భైరవ ఆరాధకులు నూకల నాగేంద్ర వరప్రసాద్, కుమారి దంపతులు, వారి కుమారుడు చిరంజీవి కాలభైరవ సహాయ సహకారాలతో హోమం జరిగింది. నూకల కుటుంబ వంశీకురాలు, 101 ఏళ్ల నారాయణ రత్నం కూడా ఈ హోమ నిర్వహణలో సేవలు అందించడం విశేషం. మధ్యాహ్నం గోశాల ప్రాంగణంలో జరిగిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని భైరవ ప్రసాదాన్ని స్వీకరించారు. గోశాల సేవకులు డాక్టర్‌ చీకట్ల వెంకటానందం, జక్కంపూడి శ్రీనివాసరావు, యర్రంశెట్టి వెంకటరమణ, గోకరకొండ బాల గణేష్, గొవ్వాల అచ్యుత రామయ్య, అయ్యల మల్లిబాబు, బసవా సింహాద్రి, యాళ్ల అప్పలరాజు, యెండూరి సీత, జక్కంపూడి సీతాకుమారి, మాతంశెట్టి కుమార్, కేవీ మావుళ్లయ్య, దాసరి సూరిబాబు తదితరులు మూడు రోజులుగా హోమ నిర్వహణలో సేవలందించారు. లక్ష గారెలను వండే కార్యక్రమంలో 400 మంది మహిళలు శ్రమదానం చేశారు. గోశాలకు వచ్చే మార్గాల్లో పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసు బందోబస్తు ఏర్పాౖటెంది. చివరగా సీతానగరం చిట్టి బాబాజీ సంస్థానం వ్యవస్థాపకుడు జగ్గుబాబు గోశాలను సందర్శించి యాగశాలలో పూజలు చేశారు.

     
>
మరిన్ని వార్తలు