2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం

19 Jul, 2016 23:01 IST|Sakshi
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం మండంలోని దేశ్‌ముఖిలోని సాయి బృందావనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో నిజామాబాద్, మెదక్, కరీంనగర్‌ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. ఇలా మూడేళ్లలో దశల వారీగా రాష్ట్రంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఘంటా నారాయణస్వామిజీ, ఎంపీటీసీ దాసర్ల జంగయ్య ఉన్నారు.
 
మరిన్ని వార్తలు