రేషన్ కార్డుల విభజన పూర్తి

12 Dec, 2016 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డుల విభజన ప్రక్రియను పౌర సరఫరాల శాఖ పూర్తి చేసింది. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను కేటారుుస్తూ నిర్ణయం చేసింది. 28 జిల్లాల కు రేషన్ కేటారుుంపుల ఉత్తర్వులను శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు.  28 జిల్లాలకు గానూ 69.73 లక్షల కార్డులకు 1,40,538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 69 లక్షల 54వేల చక్కెర ప్యాకెట్లను, 69,72,029 ఉప్పు ప్యాకెట్లను డిసెంబర్ నెలకు కేటారుుంచారు.

జిల్లాల పునర్విభజనకు ముందు 10 జిల్లాలో 85 లక్షల రేషన్ కార్డులున్నాయని, ఈ కార్డులను 31 జిల్లాలకు అనుగుణంగా విభజించామన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,77,391 కార్డులుండగా, అతి తక్కువగా ఆసిఫాబాద్‌లో 1,37,585 రేషన్ కార్డులున్నారుు. నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులకు సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని వార్తలు