ముగిసిన గ్రూప్‌–బీ పోటీలు

8 Sep, 2017 22:48 IST|Sakshi
ముగిసిన గ్రూప్‌–బీ పోటీలు

అనంతపురం సప్తగిరిసర్కిల్‌: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల గ్రూప్‌–బీ క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండు రోజులుగా స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఇండోర్‌ స్టేడియం, ఎస్కేయూ క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీల్లో యూనివర్శిటీ పరిధిలోని క్రీడా జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా స్థానిక కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఎస్కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ జెస్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. జయాపజయాలను సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విజేత జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ నాగత్రిశూలపాణి, పీడీలు చంద్రమోహన్, ప్రసాద్, శ్రీరాం, జబీవుల్లా, హేమంత్, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు
బ్యాడ్మింటన్: విన్నర్స్‌–ఎస్‌ఎస్‌బీఎన్‌, రన్నర్స్‌–ఎస్కేయూ
ఫుట్‌బాల్: విన్నర్స్‌–ఆర్ట్స్‌ కళాశాల, రన్నర్స్‌–రైపర్‌ కళాశాల
బాస్కెట్‌బాల్: విన్నర్స్‌–ఆర్ట్స్‌ కళాశాల, రన్నర్స్‌–ఎస్‌ఎస్‌బీఎన్‌.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు