హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలి

25 Sep, 2016 22:43 IST|Sakshi

హిందూపురం టౌన్‌ : హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లను కేటాయించి రెండోదశ పనులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ అభివద్ధి వేదిక సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక అల్‌హిలాల్‌ పాఠశాలలో చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ ఈటీ రామ్మూర్తి, రామకష్ణ, ఎల్‌ఐసీ నరేంద్ర, బదరీష్, న్యాయవాది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘అనంత’కు ప్రాణపదమైన హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధపాత్రిపదికన పూర్తి చేయాలన్నారు.

రాయలసీమ అభివద్ధి వేదిక డిమాండ్లపై త్వరలో డాక్టర్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌ చేపట్టిన జీపుజాత హిందూపురంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా పరిగి మండలానికి శ్రీధర్, శ్రీకాంత్, లేపాక్షి మండలానికి రామాంజినేయులు, చిలమత్తూరు మండలానికి చైతన్య గంగిరెడ్డి, అలీముల్లాను ఇన్‌చార్జిలుగా ఎంపిక చేశారు. వేదిక సభ్యులు రాజశేఖర్, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, వెంకటరామిరెడ్డి, ఆదినారాయణప్ప, చంద్ర, బాబావలి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు