కేసుల రాజీతో సమయం సద్వినియోగం

21 Jul, 2016 11:28 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్: లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కె.వి.విజయకుమార్ చెప్పారు. ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం ఆగస్టు 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు సమంజసంగా వ్యవహరిస్తే ఎక్కువ కేసులు పరిష్కారమవుతాయన్నారు.

ఈ సందర్బంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యధర్శి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కోర్టుకు కట్టిన ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్ అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, పోలీసుశాఖ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ బి.బి.నాగేంద్రరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి వి.మొహన్‌కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వై.హేమలత, 3వ జూనియర్ సివిల్ జడ్జి జె.శ్రావణ్ కుమార్, బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.c

>
మరిన్ని వార్తలు