సమగ్ర దర్యాప్తు జరిపించాలి

31 Jul, 2016 01:22 IST|Sakshi
మాట్లాడుతున్న తుల్లూరి బ్రహ్మయ్య
  • జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య
  • ఖమ్మం అర్బన్‌ : ఎంసెట్‌–2 లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య డిమాండ్‌  చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నాపత్రం లేకేజీలో ప్రభుత్వం దళారులుగా వ్యవహరించిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటోందని, అసలు కారకులను వదిలేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతతో విద్యార్థుల భవిష్యత్‌ను దష్టిలో పెట్టుకుని నిర్వహించాల్సిన ఎంసెట్‌ను అర్హత లేని కంపెనీకి టెండర్లు కూడా లేకుండా నామినేటెడ్‌గా బాధ్యతలు అప్పగించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు రాయపూడి జయాకర్, తెలుగు యువత అధ్యక్షుడు గొల్లపూడి హరిక్రిష్ణ, నందిగామ ప్రేమ్‌కుమార్, వేజండ్ల ప్రసాద్, వాకదాని కోటేశ్వరరావు, అకారపు శ్రీనివాసరావు, ఆనంద్‌ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు