సహజ వ్యవసాయంపై సమగ్ర శిక్షణ

21 Jan, 2016 20:03 IST|Sakshi

విజయవాడ: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 31 వరకూ కాకినాడలో పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం(జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్)పై శిక్షణ తరగతులు జరుగనున్నాయి. సేంద్రీయ, సహజ వ్యవసాయంలో నిష్ణాతులైన సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంపై సమగ్ర శిక్షణ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇందుకోసం ఒక్కో జిల్లాలో 10 క్లస్టర్లను ఎంపిక చేసి మొత్తంగా 5 వేల మంది రైతులు, వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ ఇస్తామని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు