ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం

29 Sep, 2016 01:16 IST|Sakshi
ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం

 పెద్దఅడిశర్లపల్లి : పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్‌ జిల్లా ఐఈ కోఆర్డినేటర్‌ ఆర్‌. రవి, ఎంఈఓ వేమారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైకల్యాలను గురించి వారికి వివరించారు.  వివిధ రకాల పరికరాలు, శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ పీఏపల్లి ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడు కె. మూనా, ఐఈఆర్పీ ఎం. ప్రేమ్‌సాగర్, ఆర్‌. రాందాస్, ఎంఐఎస్‌ జాహంగీర్, ఎల్‌డీఏ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు