మంత్రి హరీష్‌రావుకు పొన్నం సవాల్‌

13 May, 2017 18:52 IST|Sakshi
మంత్రి హరీష్‌రావుకు పొన్నం సవాల్‌
కరీంనగర్ : ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతుందని ప్రజలను రెచ్చగోట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు చేసిందేమిటో తెల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సవాల్‌ విసిరారు. కరీంనగర్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమోదించడం జరిగిందని అప్పుడు ఇప్పటి టీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం లోక్‌సభ సభ్యుడేనని గుర్తు చేశారు.
 
2013 భూసేకరణ చట్టం రైతులను ముంచే విధంగా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్‌రావు కేసీఆర్‌ ఆ చట్టానికి ఆమోదం ఎలా తెలిపి ఓటు వేశాడో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్‌రావుకు తగదని సూచించారు. తాజాగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదం జరిపి రైతులను, భూనిర్వాసితుల నోట్లో మట్టికోట్టే చర్యలకు టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం లో ఉన్న వాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని ఏ ఒక్క నిబంధన రైతులకు హనీ కలిగే విధంగా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

 

మరిన్ని వార్తలు