ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోంది

25 Jul, 2016 18:07 IST|Sakshi

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం విమర్శించారు. హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి భూములు తిరిగి  వేలం వేయడానికి సిద్దంగా ఉందంటూ దేవాదాయ శాఖ ప్రకటించడంపై మండి పడ్డారు. సదావర్తి భూములవేలంలో ప్రభుత్వ తన పొరపాట్లను తప్పించుకునేందుకు కొత్త తప్పులు చేస్తోందని అన్నారు. పిఎల్ ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోట్ చేసిన 28 కోట్లను బేస్ ప్రైజ్ గా  నిర్ణయించి టెండర్ నిర్వహిస్తామనటం దారుణమన్నారు. ముందు వేలాన్ని పూర్తిగా రద్దు చేసి.. కొత్త వేలాన్ని  చేపట్టాలని డిమాండ్ చేశారు.


టీడీపీ - బీజేపీల దొంగాటను బయట పెడతాం..
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10ఏళ్లు అమలు చేస్తామని మానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని.. వీటిని బయట పెట్టేందుకు ఆగస్టు 1న విజయవాడలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

మరిన్ని వార్తలు