బరి తెగించిన కాంగ్రెస్, కలికిరిలో ఉద్రిక్తత

13 Jul, 2013 12:49 IST|Sakshi
బరి తెగించిన కాంగ్రెస్, కలికిరిలో ఉద్రిక్తత

చిత్తూరు : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి  సొంత మండలం చిత్తూరు జిల్లా కలికిరిలో కాంగ్రెస్‌ వర్గీయులు బరి తెగించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను శనివారం అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు వచ్చిన సాక్షి మీడియాపై కూడా దాడి చేశారు.

కెమెరాను ధ్వంసం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి అండ చూసుకునే కాంగ్రెస్‌ నేతలు రెచ్చి పోతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నామినేషన్లు వేసే హక్కు అందరికీ ఉందని అడ్డుకోవడం సరికాదని అన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దాడి ఘటనపై జిల్లా అధికారులను ఎన్నికల కమిషన్ వివరణ కోరింది.

కాగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు కొమ్ముకాస్తున్న పోలీసులు కూడా కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారు. తిరుపతి రూరల్ పరిధిలో నామినేషన్లు దాఖలు చేయడానికి ఎంపీడీవో కార్యాలయం వద్దకు వస్తున్న అభ్యర్థులపై వారు వివక్ష చూపుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు వస్తే ఎక్కువ సంఖ్యలో లోపలకు పంపుతున్నారు. ఇతర పార్టీల వారు వస్తే కేవలం అభ్యర్థిని మాత్రమే లోపలకు పంపుతున్నారు.

మరిన్ని వార్తలు