రాష్ట్రంలో రాచరిక పాలన - సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి

25 Jul, 2016 20:10 IST|Sakshi

మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని శాంతియుతంగా ధర్నాచేస్తే పోలీసులు లాఠీచార్జీ చేయడం, కాల్పులు జరపడం రాష్ట్రంలో రాజరిక పాలనను తలపిస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు.

 

సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ ముంపు బాధితులను మోసం చేసేందుకు 123 జీవో ద్వారా భూములు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మెప్పు కోసమే మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులను మభ్యపెడుతున్నారని, రైతులకు దాడులకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూములు లాక్కుంటే సహించేది లేదన్నారు. లాఠీచార్జీకి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

>
మరిన్ని వార్తలు