కానిస్టేబుల్కి గుండెపోటు: పోలీస్స్టేషన్లోనే మృతి 

12 May, 2016 09:23 IST|Sakshi

మెదక్ : మెదక్ జిల్లా మనూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విఠల్ (45) అనే కానిస్టేబుల్ గురువారం గుండెపోటుతో స్టేషన్‌లోనే మృతి చెందాడు. రాత్రి డ్యూటీలో ఉన్న విఠల్ గురువారం వేకువజామున కాసేపు విశ్రమించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు.  ఈ రోజు ఉదయం సహాచర కానిస్టేబుళ్లు అతడిని నిద్రలేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి... మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం కల్యాణ మండలంలోని మాడి గ్రామం.అలాగే అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు