విశ్రాంత ఉద్యోగిని చితకబాదిన కానిస్టేబుల్‌

14 Nov, 2016 22:47 IST|Sakshi
విశ్రాంత ఉద్యోగిని చితకబాదిన కానిస్టేబుల్‌

గుత్తి:  రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగిని ఒక కానిస్టేబుల్‌ చితకబాదిన సంఘటన గుత్తి ఆర్‌ఎస్‌లో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎస్‌ పల్లికి చెందిన  రైల్వే విశ్రాంతఉద్యోగి గోవిందు పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి గుత్తి ఆర్‌ఎస్‌లోని ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలుచున్నాడు. లంచ్‌ సమయం కావడంతో బ్యాంకర్లు మధ్యాహ్నం గంట పాటు లావాదేవీలు నిలిపి వేశారు. దీంతో గోవిందు క్యూలో నిలబడలేక పక్కకు వెళ్లి కూర్చున్నాడు. బ్యాంకు అధికారులు తిరిగి లావాదేవీలు ప్రారంభించడంతో క్యూలో నిలుచోవడానికి వెళ్లాడు. అయితే మోహన్‌ అనే  కానిస్టేబుల్‌ అతన్ని పక్కకు తోసివేశాడు. ఉదయం నుంచి వేచి ఉన్నానని చెప్పినా కానిస్టేబుల్‌ వినలేదు. నానా బూతులు తిడతూ చేయి చేసుకున్నాడు. దీంతో అతను కిందపడిపోయాడు. అవమానం భరించలేక ఏడ్చాడు. 100కు కాల్‌ చేసి కానిస్టేబుల్‌ మోహన్‌పై ఫిర్యాదు చేశాడు.
 

మరిన్ని వార్తలు