కొత్త ఇళ్లు కట్టించాలి

24 Sep, 2016 01:43 IST|Sakshi
కొత్త ఇళ్లు కట్టించాలి
 
  •  ఎమ్మెల్యే అనిల్‌ 
నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌నగర్‌లో నాసిరకంగా నిర్మించిన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్లు కట్టించాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు వినతిపత్రం అందజేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 6,500 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆయన పాలన కాలంలో పనులు జోరుగా సాగాయన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన పాలకులు వైఎస్సార్‌నగర్‌ను పట్టించుకోకపోవడంతో పనులు నాసిరకంగా జరిగాయన్నారు. గతంలో చంద్రబాబు, మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. ఇప్పటికైనా స్పందించి నాణ్యతతో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు.
బ్యారేజీ నిర్వాసితులను ఆదుకోవాలి 
53వ డివిజన్‌ పరిధిలోని సాలుచింతల ప్రాంతంలో పెన్నాబ్యారేజీ నిర్మాణంతో నిర్వాసితులవుతున్న పేదలనుఆదుకోవాలని ఎమ్మెల్యే అనిల్‌ కోరారు. అక్కడ అనేక ఏళ్లుగా పేదలు నివసిస్తున్నారని, బండ్‌కు బదులు ప్రహరీ నిర్మాణం లేదా ప్రత్నామ్నాయం చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, దేవరకొండ అశోక్,  పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ఆర్‌ ఇంతియాజ్, నాయకులు వేలూరు మహేష్, వందవాశి రంగా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు