పట్టిసంలో కొనసాగిన రద్దీ

25 Feb, 2017 23:58 IST|Sakshi
పట్టిసంలో కొనసాగిన రద్దీ
పోలవరం రూరల్‌(పోలవరం) : పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలకు రెండో రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి శనివారం ఉదయం పట్టిసం చేరుకుని లాంచీలపై నది దాటి పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు స్నానాలు చేసే చోట సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఎక్కడపడితే అక్కడ స్నానాలు చేశారు. ఒక వ్యక్తి స్నానం చేస్తూ సమీపంలోని గోతిలోకి జారిపోతున్న సమయంలో అక్కడున్న వారు రక్షించడంతో ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి ఇసుక తిన్నెలు యాత్రికులతో కిటకిటలాడాయి. ఒకదశలో క్యూలై న్‌ను అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 
10 గంటలకే నిలిచిన ఆర్టీసీ బస్సులు
ఉత్సవాల సందర్భంగా మూడు రోజులు ఆర్టీసీ బస్సులు నడుపుతామని అధికారులు ప్రకటించినప్పటికీ శనివారం ఉదయం 10 గంటలకే బస్సులు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వీరేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి ఆటోలో గమ్యం చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధులకు హాజరైన వివిధ శాఖల సిబ్బంది, పోలీసులు ఉదయం నుంచి వెనుదిరిగారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వేదపండితులను  ఉత్సవ కమిటీ చైర్మ న్‌ ఆర్డీఓ ఎస్‌.లవన్న ఘనంగా సత్కరించారు. 
 
 
మరిన్ని వార్తలు