కొనసాగుతున్న ‘వికారాబాద్‌’ ఆందోళనలు

22 Sep, 2016 17:08 IST|Sakshi
కొనసాగుతున్న ‘వికారాబాద్‌’ ఆందోళనలు

సీఎం దిష్టిబొమ్మ దహనం

మోమిన్‌పేట: రంగారెడ్డి జిల్లాను రెండుగానే విభజించాలని అఖిలపక్ష నాయకులు గురువారం మండల కేంద్రంలో ర్యాలీ, మానవహరం నిర్వహించారు. మండల పరిధిలోని వెల్‌చాల్‌లో రోడ్డుకు అడ్డంగా మిషన్‌ భగీరథ పైపులను వేయడంతో నాలుగు గంటలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మోమిన్‌పేటలో అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. జిల్లాను రెండుగానే విభజించాలన్నారు. డ్రాప్టు నోటిఫికేషన్‌ ప్రకారం ప్రభుత్వం వెలువరించిన 19మండలాలలతో కూడిన జిల్లానే కావాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో మోమిన్‌పేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పాలన పరంగా జిల్లా ప్రజలందరికి అందుబాటులో ఉండేలా వికారాబాద్‌ పేరు మీదనే జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ కోణంతో కాకుండా విభజన శాస్త్ర్రీయపరంగా చేయాలన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఇజాజ్‌పటేల్‌, టీడీపీ మండల అధ్యక్షుడు సిరాజోద్దీన్‌, మోమిన్‌పేట సర్పంచ్‌ వడ్ల చంద్రయ్య, నాయకులు ఒగ్గు మల్లయ్య, మాణయ్య, చంద్రకాంత్‌, సురేందర్‌, హఫిజ్‌ఖాన్‌, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు