కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం

11 Dec, 2016 01:22 IST|Sakshi
కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం
∙ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి 
అనంతపురం రూరల్‌:   కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ కళాశాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు.  అధ్యాపకుల   సమ్మెకు శనివారం ఆయన మద్దతు ప్రకటించారు.   ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరుబాట సాగిద్దామని పిలుపు నిచ్చారు.  15ఏళ్లుగా తక్కువ వేతనాలకే పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కాంట్రాక్టు అధ్యాపకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సుప్రీం కోర్డు సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందన్నారు. అయినా న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అధ్యాపకుల పోస్టులను క్రమబద్డీకరించాలన్నారు.   సమ్మెకు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు ప్రటించారు.   కొర్రపాడు హూస్సేన్ పీరా, కాంట్రాక్టు అధ్యాపకులు యర్రెప్ప, హనుమంతరెడ్డి, ప్రభాకర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు