ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

28 Dec, 2016 22:44 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షని బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు జె.నాగరాజనాయక్, హెచ్‌.నరసింహప్ప, జి.గోవిందు, కె.వెంకటేశ్వరరాజులు నిరాహార దీక్షని ఈ నెల 27న చేపట్టారు. రెండవ రోజైన బుధవారం దీక్ష కొనసాగించారు.

రాత్రి 8.30 గంటల సమయంలో  వన్‌ టౌన్‌ సీఐ రాఘవన్‌ నేతృత్వంలో ఎస్‌ఐ రంగడు, తన సిబ్బందితో అక్కడి చే రుకుని దీక్ష చేస్తున్నవారికి వైద్యుల చేత ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు, మిగతా ముగ్గురూ అస్వస్థతకు గురవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో నలుగురి దీక్షని పోలీసులు భగ్నం చేసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు