స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరించండి

13 Jan, 2017 01:42 IST|Sakshi
స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరించండి

1969 టోల్‌ ఫ్రీకి కాల్‌ చేయండి
వరంగల్‌ మహా నగర ప్రజలకు కమిషనర్‌ శృతి ఓజా పిలుపు


వరంగల్‌ అర్బన్‌ : దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలతో పోటీపడుతున్న వరంగల్‌ మహా నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2017లో మెరుగైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్‌ శృతి ఓజా పిలుపునిచ్చారు. 1969 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ ప్రశ్నలకు అనుకూలమైన సమాధానాలు చెప్పాలని కోరారు. దీంతో వరంగల్‌ మహా నగరానికి అత్యుత్తమ ర్యాంకింగ్‌ వస్తుందని కమిషనర్‌ చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రశ్నావళి, నగర పౌరుల టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి, వెల్లడించాల్సిన అంశాలను కమిషనర్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.   1969 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయగా.. కాల్‌ రింగ్‌ అయి డిస్‌కనెక్ట్‌ అవుతుంది. 912233640500 ద్వారా తిరిగి ఫోన్‌ చేసిన మొబైల్‌కు కాల్‌ వస్తుంది.సిటీజన్‌ పేరును అడుగుతోంది. అప్పడు కాల్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులు ఆయా ప్రాంతాల్లోని పిన్‌ కోడ్‌ నంబర్లను (వరంగల్‌ కోడ్‌ 506001) డయల్‌ చేయాలి.ఆరు ప్రశ్నలకు అడుగుతారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

1969 నెంబర్‌ కాల్‌ చేసి, తదుపరి వచ్చే ఫోన్‌ రిసీవ్‌ చేసుకొని ఆరు ప్రశ్నలకు అవుననే లేదా యస్‌ అనే సమాధానం చెప్పాలని కమిషనర్‌ సూచించారు. ఫలితంగా వరంగల్‌ నగరానికి 450 మార్కులు లభిస్తాయని, ఇలా వరంగల్‌కు మెరుగైన ర్యాంకింగ్‌ వస్తోందని, ఫలితంగా స్మార్ట్‌సిటీకి మరింత నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు.  

ప్రశ్నలు ఇలా..
ప్ర: మీ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2017 సర్వేలో పార్టీసిపేట్‌(భాగస్వామ్యం) విషయం తెలుసా?
జ: అవును (చెబితే 100  మార్కులు కేటాయిస్తారు).
ప్ర: గతంలో కంటే మీ ఏరియాలో పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారా?
జ: అవును చెబితే  70 మార్కులు
ప్ర: ఈ సంవత్సరం మార్కెట్‌ ఏరియాల్లో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేశారా?
జ: అవును (70 మార్కులు)
ప్ర: గత సంవత్సరం కంటే గృహవ్యర్థాల సేకరణ మెరుగ్గా ఉందా?
జ: అవును.....70 మార్కులు
ప్ర: కమ్యూనిటీ, పబ్లిక్‌ టాయిలెట్లు మీ ఏరియాల్లో అందుబాటులోకి వచ్చాయా?
జ: అవును.....70 మార్కులు
ప్ర: ఈ సంవత్సరం ఈ ఏరియాల్లోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లలో మౌలిక వసతులు మెరుగయ్యాయా?
జ: అవును...70 మార్కులు
 

మరిన్ని వార్తలు