ఆలయాల అభివృద్ధికి కృషి

3 Mar, 2017 23:45 IST|Sakshi
ఆలయాల అభివృద్ధికి కృషి

► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నేరడిగొండ : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్ధికొండ గ్రామ శివారులోగల శ్రీ మహాలక్ష్మిదేవి ఆలయంలో శ్రీలక్ష్మిమదేవి విగ్రహ ప్రతిషా్ఠపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి సరసాని లక్ష్మి కుటుంబ సభ్యులు విగ్రహాలు కొనివ్వడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా సరసాని లక్ష్మిని మంత్రి శాలువా, పూలమాలలతో సన్మానించారు. శ్రీమహాలక్ష్మీ ఆలయ అభివృద్ధికి రూ.12లక్షల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. నేరడిగొండలోని శబరిమాత ఆలయాన్ని రూ.12లక్షలతో దేవాదాయ శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ గోడంనగేశ్, రాష్ట్ర సహకార పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు లోక భూమారెడ్డి, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, ఏఎంసీ చైర్మన్  నల్ల శారద, ఉపాధ్యక్షుడు దావుల భోజన్న, స్థానిక సర్పంచ్‌ సునీత, ఎంపీటీసీ సభ్యురాలు దుర్వ గంగామణి, నాయకులు శ్రీనివాస్, రమణ, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

కుప్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతాం
కుప్టి, కుమారి గ్రామాల ప్రజలు కుప్టి ప్రాజెక్టు ప్రస్తావన తేగా మంత్రి స్పందించారు. మండలంలోని కడెం నది పరీవాహక ప్రాంతమైన కుప్టి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును 6.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి తీరుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును నిర్మించేందుకు సీఎం ఒప్పుకున్నారని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు