కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేయాలి

29 Aug, 2016 00:19 IST|Sakshi
  • టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
  • విద్యారణ్యపురి : ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టపరిచే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌)ను రద్దు పరిచి పాత పెన్షన్‌ పథకాన్నే వర్తింప చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌ యూటీఎఫ్‌) జిల్లాశాఖ ఆధ్వర్యంలోఆదివారం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి ఏకశిల పార్కువరకు ర్యాలీ నిర్వహిచారు. అనంతరం ఏకశిల పార్కు వద్ద జరిగిన సమావేశంలో  జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్‌ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఒకేరీతిగా వ్యవహరించారని అందులో భాగంగానే సీపీఎస్‌ పథకంను తీసుకొచ్చారన్నారు.  
     
    ఇటీవల రిటైర్డ్‌ అయిన మృతి చెందిన సీపీఎస్‌ ఉద్యోగులకు నామమాత్ర పెన్షన్‌ కూడా రావడం లేదన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి మాట్లాడుతూ పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసి పెన్షన్‌ నిధులు ప్రైవేటుపరం కాకుండా చూడాలన్నారు. ర్యాలీలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీనియర్‌ నాయకులు కె రంజిత్‌కుమార్, కార్యదర్శులు సీహెచ్‌.రవీందర్‌రాజు, ఆర్‌.వాసుదేవరెడ్డి, పెండెం రాజు, ఎ.రాజారాం, ఎన్‌.శ్రీనివాస్, డి.కిరణ్‌కుమార్, లింగారావు, రాజేంద్రప్రసాద్, కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు