‘అనంత’లోనే కార్పొరేటర్ల, కౌన్సిలర్లకు శిక్షణ

28 Mar, 2017 23:14 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ : ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఫినాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనర్‌ ఆధ్యర్యంలో కార్పొరేటర్ల, కౌన్సిలర్లకు కెపాసిటీ బిల్డింగ్స్‌ ప్రోగ్రామ్స్‌ అనే అంశంపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు అమృత్‌ సిటీ మిషన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ప్రతినిధులు హిమబిందు, రోజారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం కార్పొరేటర్లతో పాటు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం కౌన్సిలర్లు శిక్షణ తరగతుల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. శిక్షణ తరగతులు ఈ నెల 30, 31, వచ్చే నెల 1న నగరపాలక సంస్థలోని కౌన్సిల్‌ హాలులో నిర్వహిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు