ఉపాధి అవకాశాల గని కోస్టల్‌ కారిడార్‌

4 Nov, 2016 22:39 IST|Sakshi
  • జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత
  • రాజమండ్రి విమానాశ్రయాభివృద్ధికి చర్యలు
  • కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు
  • ప్రత్యేక ప్యాకేజీపై కాకినాడలో అవగాహన సభ
  • బోట్‌క్లబ్‌ (కాకినాడ) :
    ఉభయగోదావరి జిల్లాల్లో కోస్టల్‌ కారిడార్, కాకినాడలో  పెట్రో కెమికల్‌ యూనివర్సిటీల ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడలో శుక్రవారం ‘ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం – ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన అవగాహన సభలో ఆయన  ముఖ్యఅతిథిగా  మాట్లాడుతూ కేంద్ర సాయంతో అమలు కానున్న ప్రాజెక్టులతో జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.  జిల్లా ప్రజలు ఆప్యాయత మరువలేనిదని, తన అల్లుడు ఇక్కడి వాడేనని అన్నారు.  
     పోలవరం నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు ముంపు మండలాలును జిల్లాలో కలపడం జరిగిందని వెంకయ్య చెప్పారు.  రాజమండ్రి, గన్నవరం ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభకు వచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మార్పీఎస్‌కు మద్దతు ప్రకటించారు. 
    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభం పాటి హరిబాబు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా నిధులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలా సహకరిస్తున్న వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. అన్యాయంగా ఏపీని కాంగ్రెస్‌ ప్రభుత్వం విడదీస్తే 34 వేల ఎకరాల్లో  ప్రత్యేక రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేశారన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్‌ సిటీగా ప్రకటించిన ఘనత  వెంకయ్యనాయుడిదేనన్నారు. వెంకయ్యనాయుడిని కాకినాడ ప్రజల తరఫున తోట నరసింహం ఘనంగా సత్కరించారు.
    దారి పొడవునా స్వాగతం 
    ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన సభకు వచ్చిన వెంకయ్యనాయుడికి నగరంలో దారిపొడవునా జేజేలు పలికారు. కార్లు, బైక్‌ల ర్యాలీతో కార్యకర్తలు స్వాగతం పలికారు.  దారి పొడవునా ఆయనకు వివిధ సంస్థలు స్వాగతం పలికాయి. సినిమారోడ్డులో రెల్లి కులస్థులు ఎస్సీలో కలపాలని వినతి పత్రం సమర్పించారు. వైస్సార్‌ వారధి వద్ద వివిధ కళాశాలలకు విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు. భానుగుడి సెంటర్‌ వద్ద కిలోమీటరు పొడవు జాతీయ జెండాతో స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు వెంకయ్యనాయుడుకు పోలవరం నమూనా  అందజేశారు. బీజేపీ నాయకుడు సబ్బతి ఫణీశ్వర్‌ారవు తూరంగికి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఆయుష్‌ కార్యకర్తలు రెగ్యులర్‌ చేయాలని ప్లేకార్డులు చేతపట్టుకని సభకు వచ్చారు.  బీజేపీ శాసన సభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్,  ఎమ్మెల్సీ సోము వీర్‌ారజు, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావు, పైడా కృష్ణమోహన్, ఉంగరాల చినబాబు, ఆల్డా చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్, రాష్ట్ర ఇ¯ŒSచార్జ్‌ సిద్ధార్ధ సింగ్, జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా, నాయకులు ఏపీఆర్‌ చౌదరి, బి.రవీంద్రరాజు, చల్లపలి నరసింహారెడ్డి, కర్‌?ర చిట్టిబాబు , జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
     
     
     
మరిన్ని వార్తలు