మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు కౌన్సెలింగ్‌

8 Sep, 2016 00:30 IST|Sakshi
వరంగల్‌ : మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలకు షీ టీం ఇన్‌చార్జీ ఏసీపీ ఈశ్వర్‌రావు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గత కొద్దిరోజులుగా వరంగల్, హన్మకొండ, రంగశాయిపేట జూని యర్‌ కాలేజీ, కేడీసీ, జిజ్ఞాస జానియర్‌ కాలేజీ, బస్టాండ్, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల సమీపంలో గ్రూపులుగా ఏర్పడి కాలేజీలకు వచ్చిపోయే విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు షీ టీంకు సమాచారం అందిందన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వేధింపులకు పాల్పడుతున్న పస్తం నాగేశ్, ఎండి.హుస్సేన్, చిన్నపల్లి అఖిల్, కావటి కరుణాకర్, విష్ణు, గండి రాహుల్, పి.విఠల్, శివకందన్, ఎండీ అంజాద్, ఎండీ అన్వర్, బాసానీ అఖిల్, జూలూరి సాయితేజ, మండ బిక్షపతి, మోరె అని ల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరికివారి తల్లిదండ్రుల ముం దు కౌన్సెలింగ్‌ నిర్వహించడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈకేసులు నమోదైతే ప్రభు త్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణింపబడుతారని హెచ్చరించారు. కౌన్సెలింగ్‌ కార్యక్రమంలో షీటీం కానిస్టేబుళ్లు శ్రీని వాస్, బిచ్యానాయక్, రమణ, శ్రీనివాస్, రాజేశ్, వనజ, మోనికాలు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు