దేశ ప్రయోజనాలు కాలరాసేందుకే ఎఫ్‌డీఐ

21 Aug, 2016 19:13 IST|Sakshi

జమ్మలమడుగు:  బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, రక్షణ,పౌరవిమానయాన రంగాల్లో  దేశప్రయోజనాలకు భిన్నంగా కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఐడి పరిమితి పెంచే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లనుంచి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.  కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలన్నారు.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి మళ్లించిన రూ.600కోట్లు తిరిగి జమచేసి  అసంఘటిత రంగ కార్మికులకందరికీ సమగ్ర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  ఎఫ్‌డీఐల పరిమితి పెంచే ప్రయత్నానికి నిరసనగా సెప్టెబర్‌ 2 న దేశ వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు