'కొమురవెల్లి'లో కోడెల వేలం నిలిపివేయండి

22 Dec, 2016 04:37 IST|Sakshi

- మల్లన్న ఆలయ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
- సాక్షి కథనంతో కదలిక


కొమురవెల్లి:
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కోడెల వేలాన్ని నిలిపి వేయాలని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఆల యాధికారులను ఆదేశించారు. ఆలయానికి ఇచ్చిన కోడెలను కబేళాకు అమ్ముకుంటున్న తీరుపై ‘మల్లన్నా.. ఇదేం ఘోరం’ అన్న శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం  ఆలయాన్ని సందర్శించిన ఆయన.. కోడెల అమ్మకంపై విచారణ చేపట్టారు. అనంతరం విలేక రులతో మాట్లాడారు. ఇక నుంచి క్రయవిక్రయాలు చేపట్ట వద్దని ఈవోను ఆదేశించారు. కొమురవెల్లిలో గోశాలను అభి వృద్ధి చేసి గోవులు, కోడెల సంరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయి లో నిర్వహించాలన్నారు. ప్రతి మూడు, 4 నెలలకు ఒకసారి సమీక్షించి ప్రత్యే క చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. (చదవండి: ఘోరం మల్లన్నా.. ఘోరం!)  

వీహెచ్‌పీ ధర్నా: కొమురవెల్లి మల్లన్నకు భక్తులు భక్తితో ఇచ్చే కోడెలను వేలంతో కబేళాలకు తరలింపును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించింది. ఈ మేరకు ఆలయ ఈఓ రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేసింది. అనంతరం వీహెచ్‌పీ జిల్లా నాయకుడు వీరబత్తిని సత్యనారాయణ మాట్లాడుతూ గోవులను కబేళాకు తరలింపుతో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు