ఈ నెల 11 నుంచి సీపీఐ బస్సు యాత్ర

9 Sep, 2016 18:40 IST|Sakshi
ఈ నెల 11 నుంచి సీపీఐ బస్సు యాత్ర
యాదగిరిగుట్ట : తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం పాలకుల మెడలు వంచిన పోరాట చరిత్ర సీపీఐదేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోద శ్రీరాములు ఉద్ఘాటించారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ధర్మభిక్షం భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి దశ పోరాటంలో అడ్రస్‌ లేని పార్టీలు సెప్టెంబర్‌ 17ను తెలంగాణా విమోచన దినాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాటి పోరాటంలో 4, 500మంది అమరులు కాగా 10లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు పంచిన ఘన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. అధికారం లేనప్పుడు తెలంగాణ వీలిన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్‌.. ప్రత్యేక రాష్ట్రంలో విస్మరించడం అమరుల ఆశయాలను అవమానించడమే అన్నారు. ఆ నాటి పోరాట విశేషాలను నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతో సీపీఐ ఊరురా తెలంగాణ సాయుధ పోరాట బస్సు యాత్ర ఈనెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి, మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బండి జంగమ్మ, సీనియర్‌ నాయకులు బబ్బూరి నాగయ్య, కైరంకొండ ప్రకాష్, బొమ్మ బాలకిషన్, కోకల రవి, పేరబోయిన బంగారి, గోరేటి రాములు, బబ్బూరి శ్రీధర్, వీరస్వామి, నర్సమ్మ తదితరులున్నారు. 
 
>
మరిన్ని వార్తలు