'అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

9 Mar, 2016 18:06 IST|Sakshi
'అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో బుధవారం ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వంతో నీటి పారుదల ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకోవడం హర్షనీయమన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం మంచిది కాదని హితవు పలికారు. తాత్కాలిక ఉపసమనాలతో ప్రజలపై భారం మోపవద్దని ప్రభుత్వానికి సలహానిచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు